తల్లి చనిపోయినా విధి నిర్వహణలోనే.. ఎస్సైపై ప్రశంసలు..!

Wednesday, April 1st, 2020, 11:00:03 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలను చేపడుతుంటే పోలీసులు కూడా అదే విధంగా తమ విధులను నిర్వహిస్తున్నారు.

అయితే విజయవాడలో ఎస్సైగా పని చేస్తున్న శాంతారామ్ తన తల్లి చనిపోయినా విధి నిర్వహణకే అంకితమయ్యారు. విజయవాడలో ఎస్సైగా పని చేస్తున్న శాంతారామ్ పెద్ద కొడుకు అయినా తల్లి కర్మను తన సోదరుడికి అప్పచెప్పి తాను విధుల్లోనే ఉన్నాడు. ఆఖరికి తల్లి కడసారి చూపుకు కూడా నోచుకోకుండా కరోనా వైరస్ కట్టడి చర్యల్లో పనిచేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఈయన చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.