బయటికొచ్చిన రెండ్రోజుల్లోనే చింతమనేనికి షాకిచ్చిన పోలీసులు!

Monday, November 18th, 2019, 12:55:25 PM IST

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ గత రెండు నెలల నుండి జైలులోనే ఉంటున్నాడు. అయితే శుక్రవారం బెయిల్ మీద విడుదల అయిన చింతమనేని ప్రభాకర్ పై మరొక కేసు నమోదైంది. శనివారం ఏలూరు జైలు నుండి విడుదలైన చింతమనేని ప్రభాకర్ ర్యాలీ గా దుగ్గిరాలలోని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇదే సమయం లో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, త్రి టౌన్ సీఐ మూర్తి అన్నారు. అయితే ర్యాలీగా వస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని పోలీసులు ఆరోపించడం తో అసలు కథ మళ్ళీ మొదలయ్యింది.

అయితే అది మాత్రమే కాదు, చింతమనేని ర్యాలీ సమయం లో పోలిసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీస్ మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంఘించారనే అభియోగాలు చేయడం తో ఏలూరు త్రి టౌన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపిన చింతమనేని ప్రభాకర్ ఈ కేసు విషయం లో ఎలా స్పందిస్తారు అని విషయం రాష్ట్రంలో చర్చాంశనీయం అయింది.