హైదరాబాద్ హాస్టల్ లలో ఉంటున్న వారికి భారీ ఊరట

Wednesday, March 25th, 2020, 04:28:21 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో హస్తలర్లకు భారీ ఊరట లభించింది. అమీర్పెట్, పంజాగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్ల నీ ఖాళీ చేయాలంటూ ఇప్పటికే నిర్వాహకులు ఒత్తిడి చేయడం తో యువతీ యువకులు పోలీస్ స్టేషన్లు ఎదుట ఆందోళన కి దిగారు.అయితే తమకు ఇంటికి వెళ్ళడాని కి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే వారికి ఎలాంటి అడ్డంకి లేకుండా వారి సొంత ఊళ్లకు వెళ్లేలా పోలీసులు పాసులు ఇచ్చారు.ఈ పాసులు చెక్ పోస్టుల వద్ద చూపిస్తే వారిని అడ్డగించరు.అయితే ఈ విషయాన్ని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అయితే హైదరాబాద్ లోని పలు చోట్ల పరిస్తితి ఇలానే ఉండటం తో హాస్టల్ నిర్వాహకులు నుండి noc తీసుకు రమ్మని పోలీసులు కోరుతున్నారు. తద్వారా వారికి పాసులు మంజూరు చేస్తున్నారు పోలీసులు. మొదట జనత కర్ఫ్యూ విధించిన మోడీ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తాజాగా నరేంద్ర మోడీ మరొక 21 రోజుల లాక్ డౌన్ తప్పనిసరి అని ప్రకటన చేయడం తో పరిస్తితి మారిపోయింది.