ఆ కేసులో నిందితుడిగా టీడీపీ మాజీ మంత్రి.. రేపు అరెస్ట్..!

Friday, July 3rd, 2020, 02:19:43 AM IST


ఏపీ మంత్రి పేర్ని నాని సన్నిహితుడు మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అయితే గత నెల 29న బందరులో భాస్కరరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసులో నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను విచారించారు. కొల్లు రవీంద్రతో మాట్లాడామని పోలీసులకు నిందితులు చెప్పినట్టు సమాచారం. దీంతో కొల్లు రవీంద్రను రేపు అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.