రేణిగుంట ఎయిర్పోర్ట్ లో బాబు ను నిలిపివేసిన పోలీసులు…నేల పై బైఠాయించి బాబు నిరసన!

Monday, March 1st, 2021, 11:55:07 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి నిబంధనల కారణం గా చంద్రబాబు నాయుడు పర్యటన కి అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. దీంతో రేణిగుంట విమానాశ్రయం లో బాబు ను పోలీసులు నిలిపివేశారు. అయితే చంద్రబాబు ను అడ్డుకోవడం తో నేల పై బైఠాయించి బాబు నిరసన తెలుపుతున్నారు. అయితే బాబు రాకతో మరోపక్క విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటాం అని పోలీసులు చంద్రబాబు కి నోటీసులు జారీ చేయడం జరిగింది.అయితే చిత్తూరు జిల్లా పర్యటన కి సంబందించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదు అని అందులో పేర్కొనడం జరిగింది.

అయితే చంద్రబాబు నాయుడు తలపెట్టిన పర్యటన ఎన్నికల కి విఘాతం కలిగే విధంగా ఉందని వెల్లడించారు. అయితే ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతలను గృహ నిర్భంధం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.