బ్రేకింగ్: పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..!

Tuesday, January 14th, 2020, 03:31:25 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ పర్యటనకు బయలుదేరారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న పవన్ మొన్న కాకినాడలో వైసీపీ జరిపిన దాడులలో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించందుకు కాకినాడ వెళుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో కాకినాడలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

అయితే ఇప్పటికే పవన్ రాక గురుంచి తెలిసిన జనసైనికులు, అభిమానులు వేలాదిగా కాకినాడకు తరలివస్తున్నారు. అయితే కాకినాడకు బయలుదేరిన పవన్ కాన్వాయ్‌ని తుని దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పవన్ పర్యటనకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని, అరెస్ట్ చేయమని ఎస్పీ నయీం హస్మీ స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఉన్నట్టుండి పవన్ కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పోలీసులపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రస్తుతం తుని దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాకినాడలో 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.