యాక్సిడెంట్ చేసి ఎస్కేప్ అయిన కుర్ర హీరోలు!

Friday, September 29th, 2017, 11:35:56 AM IST


సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఫేం, సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. అయితే కొంత మంది హీరోలు వస్తున్నా సంపాదనని కంట్రోల్ చేసుకోలేక చెడు వ్యసనాలకి అలవాటు పడతారు. సినిమా స్క్రీన్ మీద హీరోగా ఉండే వాళ్ళు, ఆ వ్యసనాల వలన ఏదో ఒక రోజు అడ్డంగా దొరికిపోయి ప్రజల ద్రుష్టిలో విలన్ అనిపించుకుంటారు. ఇప్పుడు అలాగే ఇద్దరు కుర్ర హీరోలు గంజాయి తీసుకొని రోడ్డు మీద కారు ఆక్సిడెంట్ చేసి, జనం వచ్చేసరికి తప్పించుకొని జంప్ అయిపోయారు. వారితో పాటు ప్రయాణిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసారు, ఇప్పుడు ఆ కుర్ర హీరోలు ఇద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా జరిగింది బెంగుళూరులో, ఆ కుర్ర హీరోలు ఇద్దరు కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రజ్వల్, దిగంత్.

అసలు విషయంలోకి వెళ్తే ఆదికేశవులు నాయుడు కొడుకు విష్ణు తన స్నేహితులు కన్నడ హీరోలైన ప్రజ్వల్, దిగంత్ తో కలిసి గంజాయి సేవించి రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మితిమీరిన వేగంలో కారు డ్రైవర్ చేస్తూ మిగిలిన వాహనదారులని భయభ్రాంతులకు గురిచేస్తూ, ఓ కారుని ఓవర్ టెక్ చేసే క్రమంలో డివైడర్ ని డీకొట్టి, ఆపై ముందు వెళ్తున్న ఒమ్నీ వ్యాన్ ని గుద్దేశారు. ఈ ఘటనలో ముగ్గురుకి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే అక్కడికి వచ్చిన జనం వారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే హీరోలు ఇద్దరు తప్పించుకుని వెళ్ళిపోయారు. విష్ణుని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ కారులో గంజాయి స్వాదీనం చేసుకున్నారు. దీంతో ఆ యువ హీరోలు ఇద్దరిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments