బ్రేకింగ్ : గుంటూరు జిల్లాలో రాజుకున్న రాజకీయ గొడవలు…

Saturday, June 15th, 2019, 12:03:24 AM IST

కొద్దీ సేపటి క్రితం గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రాజకీయ ఘర్షణలు తలెత్తాయి…. వేర్వేరు గ్రామాల్లో వేర్వేరు కారణాలతో వివాదాలు తలెత్తి వైసిపి కార్యకర్తలపై, టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలుస్తుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌టిలకు ప్రభుత్వం 20 ఏళ్ల కిందట పొలాలిచ్చింది. ఈ లబ్ది పొందిన వారిలో వైసీపీ మరియు టీడీపీ మద్దతు దారులున్నారు… కాగా గతం నుండే ఈ గొడవలు ఉన్నటు సమాచారం. ఈ మేరకు ఈ విషయం మీద మాట్లాడుకునేందుకు ఇరుపక్షాలు ఒకచోటకు చేరుకున్నాయి. కాగా అక్కడ కూడా ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో వైసిపి వర్గీయులపై టిడిపికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. కాగా ఈదాడిలో వైసిపికి చెందిన మాజీ సర్పంచ్‌ ఎం.శివరావు, అవల శ్రీను గాయపడ్డారు. యడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెంలో వైసిపికి చెందిన అలకుంట వెంకయ్య తన మనుమడు పుట్టినరోజు కావడంతో బాణాసంచా కాల్చారు. అయితే ఆ నిప్పురవ్వలు తమ ఇళ్లపై పడుతున్నాయని టిడిపికి చెందినవారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఈ గొడవ పెడగా అయింది. ఈ ఘటనలో వైసిపికి చెందిన పి.శివ, అంకమ్మరావు, రవి, వెంకట్రావు, అంకమ్మబాబు, లక్ష్మీనరసయ్య, టిడికిపి చెందిన నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైసిపి ఎమ్మెల్యే విడదల రజిని క్షతగాత్రులను పరామర్శించారు.