కుమ్ములాట షురూ..జేసీకి కౌంటర్ ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే..!

Wednesday, September 27th, 2017, 12:18:37 AM IST

తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన సీమ జిల్లా అనంతపురంలో ఆధిపత్య పోరు షురూ అయింది. చాగల్లుకు నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి బెదిరించడంతో టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా జీవో జారీ చేసింది. జేసీ వ్యవహారం పార్టీ కి తలనొప్పిగా మారకూడదని భావించిన చంద్రబాబు ఆయన కోరికని నెరవేర్చారు. కాగా అదే బాటలో మరికొందరు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా నడుస్తున్నారు.

సింగనమల ఎమ్మెల్యే యామిని బాల తన నియోజకవర్గానికి కూడా సాగునీరు కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. యామిని చేపట్టిన ఆందోళన జేసీకి కౌంటర్ అని అంటున్నారు. రైతులతో కలసి ర్యాలీగా ఆమె కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తన నియోజకవర్గానికి సాగునీరు కోసం ఆమె కలెక్టర్ ని డిమాండ్ చేసారు. జేసీ కి కౌంట్ వేసిన ఆమె మాట్లాడుతూ ఎవరైనా రాజీనామా చేస్తామని బెదిరిస్తే ఇచ్చేస్తారా.. ఇక్కడ మా పరిస్థితి ఏంటి అని యామిని అన్నారు. నీటి వివాదాలు జిల్లాలోని సొంత పార్టీ నేతల మధ్యే వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments