దర్శకుడు తేజను తప్పించడం వెనుక రాజకీయం ఉందా ?

Friday, April 27th, 2018, 09:37:43 AM IST

ఎన్టీఆర్ టైటిల్ తో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కించే పని మొదలు పెట్టాడు దర్శకుడు తేజ. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకోవడం పలు సంచలనాలను తావిస్తోంది. కావాలనే తేజను తప్పించారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ అంటే అయన రాజకీయ జీవితం, పర్సనల్ లైఫ్ లాంటి విషయాలు ఎంతవరకు చర్చించాలి అన్న విషయం పై బాలయ్య – తేజ ల మధ్య తేడాలు వచ్చాయని తెలుస్తోంది. అసలే దర్శకుడిగా తేజ మహా మొండివాడు అన్న విషయం తెలిసిందే. ఆయనకు నచ్చిందే చేస్తాడు .. ఎవరు ఎమన్నా ఒక్క పట్టాన ఒప్పుకోడు. అందుకే బాలయ్య తో తీవ్ర విభేదాలు వచ్చే ఈ ప్రాజెక్ట్ నుండి తేజ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీని వెనక రాజకీయాలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజ నిజాలు ఎంతవరకు అన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments