కెరీర్ అయిపోయిన హీరోయిన్ల‌కు.. మీటూ ఓ భీమా ప‌థ‌కం.. కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో స‌మంతకి షాక్..!

Thursday, October 11th, 2018, 06:33:12 PM IST

బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన తాజా కాస్టింగ్ కౌచ్ ఇష్యూ పై క‌థానాయిక‌లు ఒక్కొక్క‌రుగా మ‌ద్ద‌తు తెల్పుతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కు ఎదుర‌వుతున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా ఏర్పాటైన మీటూ ఉధ్య‌మం రోజురోజుకీ తారా స్థాయికి చేరుకుంటుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న చిత్ర‌పరిశ్ర‌మ‌ల్లో లైంగికంగా వేధింపుల‌కు గురైన‌ హీరోయిన్లకు మీటూ ద్వారా భారీ స్థాయిలో మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది.

అయితే తాజాగా మీటూ ఉధ్య‌మానికి మ‌ద్ద‌తు తెల్పిన అక్కినేని కోడ‌లు స్టార్ హీరోయిన్ స‌మంత‌కు సోష‌ల్ మీడియాలో అనూహ్యంగా చేదు అనుభ‌వం ఎదురైంది. సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే స‌మంత‌కు ఒక నెటిజ‌న్ నుండి ఊహించ‌ని ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. స‌ద‌రు నెటిజ‌న్ ప్ర‌శ్నిస్తూ మీరు తాజాగా మీటూకి మ‌ద్ద‌తు ఇచ్చారు క‌దా.. ఇప్పుడు త‌నుశ్రీ ద‌త్తా వివాద‌మే తీసుకుందా.. ఆమె ప‌దేళ్ళ కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న అంటూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెబితే ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజ‌ముంద‌ని ఎలా ఒప్పుకుంటారు అని ప్ర‌శ్నించాడు.

దీనికి స‌మంత జవాబిస్తూ అదే మా దుర‌దృష్టం, భ‌యం కూడా మేము ఏం చెప్పినా.. ఎక్క‌డ మీరు నిజమ‌ని ఒప్పుకోర‌ని మాకు స‌మ‌యం, సంద‌ర్భం కుదిరిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి చీక‌టి నిజాలు చెబుతుంటామ‌ని స‌మంత జ‌వాబిచ్చింది. ఇక మ‌రో నెటిజ‌న్ మీటూ పై స్పందిస్తూ.. మీటూ గురించి మీడియాలో, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న నేప‌ధ్యంలో ఈరోజు నాకొడు మీటూ అంటే ఏంట‌ని అడిగాడ‌ని.. అందుకు నేను స‌మాధానం చెబుతూ రంగుల ప్ర‌పంచంలో ఉండే.. ఆడ‌వారికి రిటైర్మెంట్ ఇన్స్యూరెన్స్ ప‌థ‌కం అని.. వాళ్ళు త‌మ కెరీర్ ఎండ్ అయిన‌ప్పుడు ఆ భీమాని వాడుకుంటార‌ని.. అప్పుడు మీడియాలో టీఆర్పీ బ‌స్ట‌ర్ వార్త‌లు వ‌స్తాయిని చెప్ప‌గా.. మా అబ్బాయి గాడ్ బ్లెస్ ఇండియా అన్న‌డ‌ని సమంత‌కు వివ‌రించాడు. దీంతో మండిపోయిన స‌మంత.. అదే ప్ర‌శ్న మీ కూతురు అడిగితే ఏం ఆన్స‌ర్ ఇస్తావంటూ గట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది సమంత‌. దీంతో ఇప్పుడీ మ్య‌ట‌ర్ సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతోంది.