రాజకీయాలపై ఆసక్తి లేదన్న ఎన్టీఆర్ ?

Saturday, October 6th, 2018, 01:20:51 PM IST

ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఈ విషయాల గురించి మాట్లాడకుంటే బెటర్ అని చెప్పాడు ఎన్టీఆర్ ? రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రప్పించే ప్రయత్నాలు తెలుగు దేశం పార్టీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ముక్యంగా ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి . ఈ వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం గా తనకు రాజకీయలపై ఆసక్తి లేదని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఈ మద్యే తండ్రిని పోగొట్టుకున్న అయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయన హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ ని నింపింది.