పోల్ : గత కొద్దికాలంగా శ్రీ రెడ్డి చేస్తుంది సరైనదా కాదా..?

Sunday, April 22nd, 2018, 12:18:31 PM IST

భాద్యత గల పౌరునిగా నీ సమాధానం తప్పనిసరి

గత కొద్దిరోజులుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అల్లర్లు, అలజడులు అందరికి తెలిసిందే. ప్రముఖ సంచలన నటి శ్రీ రెడ్డి చిత్ర సీమలో తెలుగు వారికి సినిమాల్లో చాన్సులు ఇవ్వడం లేదని, చాలా సినిమాలకు ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి హీరోయిన్లను పిలిపించి చాన్సులు ఇస్తున్నారని చిత్ర సీమపై ఆరోపణలు చేసింది. చాలా గొడవలు, చర్చలు, ఇంటర్వ్యులు ఇచ్చి సినీ నటుల పరువు తీసేసింది. ఇవన్నీ ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఫిలిం చాంబర్ వద్దకు వెళ్లి మీడియా ముందు బట్టలు విప్పి అర్థ నగ్న ప్రదర్శన చేసిన విషయం కూడా విదితమే. ఆమె అచేసిన పనులకు ప్రవర్తనలకు మా అసోసియేషన్ కూడా దిగి వచ్చి తనకి సినిమాల్లో చాన్సులు ఇచ్చి తన కష్టాలను తీరుస్తాం అని కూడా మాటిచ్చింది. అయినా కూడా ఆమె ఎవ్వరి మాట వినకుండా ఇటివల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఈ చర్చలోకి లాగి అనరాని అనుచిత మాటలు అని అటు అతని ఫ్యామిలీని, ఇటు అభిమానులని ఆవేదనకీ, ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. తీరా అన్ని అయ్యాక తన వెనక కొన్ని రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులు ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని చెప్పింది. ఒకటా రెండా ఎన్నని చెప్పేది శ్రీ రెడ్డి గురించి, తన చేసిన పనులు అన్నీ ఇన్నీ కాదు, కొద్దిరోజుల క్రితం ప్రముఖ సినీ రచయితల పేర్లు, నటుల పేర్లు, మీడియా చానళ్ళ ఓనర్ల పేర్లు, వాళ్లతో కలిసి దిగిన ఫోటోలు, వాట్వప్, ఫేస్ బుక్ చాట్లు బయట పెట్టి తను బజార్లోకి రావడమే కాకుండా అందరినీ బజార్లోకి ఈడ్చింది. ఇన్ని చేసిన శ్రీ రెడ్డిని పవన్ కుటుంబం, అభిమానులు, ప్రభుత్వం వదిలిపెడుతుండా అసలు ఆమె చేసింది కరక్టేనా, అసలు అందులో ఎన్ని నిజాలు, ఎన్ని అబద్దాలు, తను చేసిన దానికి మీరు సపోర్టు చేస్తారా లేదా అసలు ఈ విషయంపై జనం ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ పోల్ కి సమాధానం చెప్పండి. ఒక భాద్యత గల పౌరునిగా మీ సమాధానం తప్పనిసరి.