బ్రేకింగ్ న్యూస్: హుజుర్ నగర్ ఉప ఎన్నికలో ఇదే హాట్ టాపిక్!

Monday, October 21st, 2019, 01:39:39 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా హుజుర్ నగర్ ఉప ఎన్నిక సంచలనం రేపుతోంది. ఒక పక్క ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా నేపథ్యం లో ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ముఖ్యం కానున్నది. కేసీఆర్ పై ప్రజల తీర్పు ఎలా వుండబోతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 21 అనగా ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.89 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ప్రజల ప్రతి ఒక్కరు తమ తీర్పుని వెల్లడిస్తున్నారు. అయితే కాంగ్ర్రెస్ కి కంచుకోట అయిన హుజుర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి కి వస్తుందా ? లేదంటే తెరాస అభ్యర్థి కా? అన్నది తెలియాలంటే అక్టోబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.

ఇప్పటివరకు హుజుర్ నగర్ పోలింగ్ ప్రాంత సమీపంలో ఎలాంటి గొడవలు కూడా జరగలేదని, పోలింగ్ చాల ప్రశాంతంగా జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఒక పక్క ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బందించిన సంగతి అందరికి తెలిసిందే. నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న హుజుర్ నగర్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందా అని ప్రజలు, రాజకీయ నాయకులూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.