మహేష్ ఫాన్స్ కి ఈ పొంగల్ కి పండగేనా?

Saturday, January 13th, 2018, 04:51:32 PM IST

అవుననే విషయం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో డి వి వి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ రేపు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల డిసెంబర్ 31 న ఫస్ట్ లుక్ వస్తుందని మహేష్ అభిమానులందరూ ఎదురు చూసారు, కానికి వారి ఆశ నెరవేరలేదు. అయితే నిన్నటివరకు చిత్ర యూనిట్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ పండుగకు ఇంకా ఫస్ట్ లుక్ లేదనే అందరూ అనుకున్నారు.

అయితే ఇవాళ సడన్ గా ‘సూపర్ స్టార్ మహేష్ 24 ఆన్ ది వే’ అని టాగ్ చేస్తూ చిత్ర ప్రొడక్షన్ యూనిట్ డి వి వి ఎంటర్టైన్మెంట్స్ ని చూస్తూ వుండండి అంటూ మహేష్ బాబు ఆఫిషియల్ టీం నుండి ట్వీట్ రావడంతో మహేష్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్టి ఎదురుచూపులు రేపు తీరనుండడంతో చిత్ర టైటిల్ అనౌన్స్ చేస్తారా, లేక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందా, లేక ఏకంగా టీజర్ రిలీజ్ అవుతుందా అని మహేష్ ఫాన్స్ చర్చించుకుంటున్నారు.