రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా

Friday, September 12th, 2014, 01:22:00 PM IST


రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ప్రజాసమస్యలపై ధర్నా చేపట్టారు.ఈ ధర్నాలో పొన్నాలతో పాటు, దానం నాగేందర్ తదితర నాయకులు రోడ్డుపై భైటాయించారు.. రాష్ట్రంలో విధ్యుత్ సమస్యలు, రైతు రుణమాఫీ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఈ ధర్నాలో కాంగ్రేస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, రోడ్డుపై భైటాయించిన పొన్నాల, దానంలను పోలీసులు అడ్డుకొని బలవంతంగా అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.