కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మనువడు కోడూరి దృపత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కాసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బైక్‌పై స్పీడ్‌గా వెళ్తుండడంతో అదుపుతప్పి ఒక్కసారిగా బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే బైక్ వేగంగా ఉన్న కారణం చేత పల్టీలు కొట్టి రోడ్డుపై పడింది.
అయితే కోడూరి దృపత్ తలకు బలంగా గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రస్తుతం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని పొన్నాల కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే మనువడి మరణవార్త విన్న పొన్నాల లక్ష్మయ్య హొటహుటినా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు.