కేసీఆర్ చేసినవన్ని దొంగ దీక్షలు – పొన్నాల లక్ష్మయ్య

Saturday, October 19th, 2019, 12:00:12 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రస్తుతం 14వ రోజుకు చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పడంతో సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమ్మెను మరింత ఉదృత్తం చేశారు. అయితే కార్మికుల సమ్మెకు మిగతా రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు కూడా తోడవ్వడంతో ఇక ప్రభుత్వానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.

అయితే తాజాగా ఆర్టీసీ సమ్మెపై స్పందించిన కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడు మాట్లాడలేదన్నారు. 700 కిలో క్యాలరీల ద్రవ హారాన్ని తీసుకుని కేసీఆర్ ఆనాడే దొంగ దీక్ష చేశారని విమర్శించారు. కేసీఆర్ రాక్షస, నియంతృత్వ పోకడకు బుద్ధి చెప్పాలని, ఆర్టీసీ నుంచి తీసుకునేది ఎక్కువ, ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చేది తక్కువని ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.