చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తున్న పొన్నాల.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Thursday, March 26th, 2020, 12:00:59 AM IST

దేశంలో కరోనా వైరస్ పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీనితో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుండడంతో ప్రజలంతా ఎక్కువ మేరకు ఇళ్ళకే పరిమితం కావలసి వచ్చింది.

అయితే ఇలాంటి నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఉండడంతో ఖాళీగా ఉండకుండా చీపురు పట్టి తన ఇంటిని ఊడ్చాడు. 76 సంవత్సరాల వయసులో గళ్ల చొక్కా, తెల్ల లుంగీ కట్టుకుని, చీపురు చేతబట్టి కిచెన్‌లో శుభ్రం చేస్తున్న ఫొటో బయటకు రావడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.