కేసీఆర్, జగన్ మీటింగ్ ఫై పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు

Wednesday, January 15th, 2020, 02:00:02 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు ఆరు గంటలకు పైగా చర్చలు జరపడం పట్ల పారదర్శకత ఎక్కడ ఉందని మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ చర్చలో అధికారులెవరూ పాల్గొనలేదు, అయితే అధికారులు లేకుండా ముఖ్యమంత్రులు చర్చలు జరపడం వెనుక ఆంతర్యం ఏమిటని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, వైసీపీ కార్యకర్తలని, నేతలని తమ వైపుకి లాక్కొనేనెందుకు ముఖ్యమంత్రి జగన్ తో ఈ సమావేశం ఏర్పాటు చేసారని సంచలన ఆరోపణలు చేసారు.

తెలంగాణ ప్రభుత్వ తీరు ఫై మరొకసారి తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేసారు పొన్నాల లక్ష్మయ్య. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మూడేళ్ళుగా అధిక మొత్తంలో నీటిని ఆంధ్రప్రదేశ్ కే తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మరొకసారి వైయస్సార్ ని గుర్తు చేసారు. దివంగత నేత వైయస్సార్ మరణించినపుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరిచిపోవద్దని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు గుర్తు చేసారు. వారిద్దరూ ఇరు రాష్ట్రాల నీటి పంపకాల గురించి చర్చలు జరిగి ఉంటే ఆ శాఖ కార్యదర్శలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.