ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్…పాంటింగ్ ఏమన్నాడంటే?

Wednesday, March 31st, 2021, 02:23:27 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ భుజం కి గాయం అయి, సర్జరీ అవసరం కావడం తో పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్థానం లో ఎవరు వస్తారు అనే దాని పై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్, వన్డే, టీ 20 సిరీస్ లలో పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే పంత్ ఆటతీరు తో ప్రతి ఒక్కరినీ కూడా ఆకట్టుకున్నాడు. అయితే ఢిల్లీ యాజమాన్యం పంత్ పట్ల నమ్మకం ఉంచుతూ కెప్టెన్సీ ను కట్టబెట్టింది.

అయితే పంత్ కెప్టెన్సీ గా ఎన్నుకోవడం పట్ల కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం చేపట్టడం వలన పంత్ మరింత మెరుగైన ఆటగాడి గా ఎదుగుతాడు అని అన్నారు. తాజా ప్రదర్శనల దృష్ట్యా అతను కెప్టెన్ కి అర్హుడు అని వ్యాఖ్యానించారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఐపియల్ కి దూరం అవ్వడం దురదృష్టకరం అని అన్నారు. పంత్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా అని తెలిపారు.