జోరుమీదున్న పూజ .. ప్రభాస్ సరసన ఛాన్స్ ?

Thursday, February 8th, 2018, 03:51:38 PM IST

దువ్వాడ జగన్నాధం సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అందాల భామ పూజ హెగ్డే మంచి జోరుమీదుంది. ఇప్పటికే అటు మహేష్ సరసన, ఇటు ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తాజాగా ప్రభాస్ పక్కన జోడిగా నటించేందుకు రెడీ అయింది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఇప్పటికే హైద్రాబాద్ లో జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉండడంతో ప్రభాస్ మరో సినిమాను మొదలు పెట్టనున్నాడు. జిల్ దర్శకుడు రాధా కృష్ణ తో అయన సినిమాకు కమిట్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ లో మొదలు పెట్టి జూన్ వరకు చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచన్లలో ఉన్నారట. ఈ సినిమాకోసం ప్రభాస్ ఏకంగా నెలరోజులు షెడ్యూల్ ని కేటాయించాడట. ప్రేమకథగా తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు భామలను పరిశీలించి చివరకి పూజ హెగ్డే ను ఎంపిక చేశారట. సో మొత్తానికి ముగ్గురు క్రేజీ హీరోలత్తో సినిమాలు చేస్తున్న పూజ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు.