లేటెస్ట్ బజ్ : AA19తో పూజా స్పెషల్ టాలెంట్.?

Saturday, June 15th, 2019, 12:31:28 AM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి సంబందించిన రెండో షెడ్యూల్ కూడా ఇటీవలే మొదలైంది.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు షూటింగ్ శర వేగంగా జరుగుతుందట.అలాగే ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

రాయితీ ఈ సినిమా ద్వారానే పూజా తనలోని ఉన్న స్పెషల్ టాలెంట్ ను బయటపెట్టబోతున్నట్టు సమాచారం.పూజా ఈ సినిమాతో మొట్ట మొదటిసారిగా సింగర్ గా మారనున్నట్టు తెలుస్తుంది.దీనిపై ఇప్పటికే ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా పనిలో పడ్డారట.ఇక్కడే ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పాట పక్కా మాస్ సాంగ్ గా ఉందనున్నట్టు సమాచారం.ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సాద్యమైనంత త్వరగా విడుదల చేసే యోచనలో ఉన్నారట.మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.