సౌత్ పై టార్గెట్ పెట్టిన పూజ .. బాలీవుడ్ ఛాన్స్ మిస్ ?

Sunday, January 7th, 2018, 01:47:10 PM IST

దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజ హెగ్డే ఫోకస్ అంతా ఇప్పుడు సౌత్ పైనే ఉన్నట్టుండి. ముఖ్యంగా తెలుగులో వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దువ్వాడ జగన్నాధం తో గ్లామర్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన పూజ ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు పెట్టేస్తున్న ఈ భామ ఇక్కడ బిజీ అవ్వడంతో తాజగా బాలీవుడ్ లో ఓ క్రేజీ అవకాశాన్ని మిస్ చేసుకుంది. జాన్ అబ్రహం, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రల్లో నటించే రా అనే సినిమా తెరకెక్కుతుంది. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ ను అడిగారట. అయితే ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు వరుసగా ఉండడంతో నో చెప్పిందట పాపం !! అందరు బాలీవుడ్ అవకాశాలు కోసం ఎదురుచూస్తుంటే పూజ మాత్రం వచ్చిన అవకాశాన్ని వద్దంది.