రోజూ 15 నిమిషాలు ఆ పనికి..హీరోయిన్ కి ఇదేం వింత అలవాటు..!

Tuesday, February 21st, 2017, 09:32:41 AM IST


ఎవరైనా రోజూ సంతోషంగా ఉండడం కోసం వారికి తోచిన విధంగా ప్రయత్నిస్తారు. కానీ హీరోయిన్ పూజా హెగ్దే మాత్రం ఓ వింత అలవాటు ఉందట. సంతోషంగా ఉండడానికి కాదు. భాదపడడానికి. కోలీవుడ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగులోకూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది. కానీ సరైన విజయం దక్కలేదు.దీనితో అదృష్టం లేని హీరోయిన్ అనే ముద్ర పడిందట. తన ప్లాపు చిత్రాల కోసం రోజూ 15 నిమిషాలు కేటాయించి ఆ సమయంలో బాధపడుతుందట.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.అలాగే సినిమా విజయం కేవలం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. సంపూర్ణంగా మనం చేసే పనికి న్యాయం చేయడమే ముఖ్యం అంటూ వేదాంతం మాట్లాడుతోంది. అందువలనే తాను పరాజయాలకు భయపడను. కానీ ప్లాపు చిత్రాల కోసం భాదపడడానికి 15 నిముషాలు కేటాయిస్తానని పూజా హెగ్దే చెబుతోంది. మిగిలిన సమయంలో పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను అని చెబుతోంది. ఈ అలవాటుని రోజు చేయాలనీ తనకు తానుగా విధించుకుందట.ప్లాపు సినిమాలకోసం భాధపడేవారు ఉంటారు కానీ ఇలా పూజా హెగ్డేలా రోజు 15 నిముషాలు భాధపడేవారు ఉండరని ఈ భామపై సెటైర్లు వినిపిస్తున్నాయి.