ఎన్టీఆర్ త్రివిక్రమ్ సెట్లో పూజా దిగింది రోయ్..!

Monday, May 14th, 2018, 02:42:18 PM IST

త్రివిక్రమ్ అంటేనే కొన్ని సార్లు ఆలోచించడానికి కూడా అంతు పట్టని మాటల సునామి. ఈ మధ్య పవ త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా హితు కొట్టకపోయినా త్రివిక్రమ్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటేఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. అయితే సోమవారం సెట్స్‌లోకి పూజ తన మొదటి ఎంట్రీ ఇచ్చిందట. తారక్‌, పూజకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా ఆయత పెట్టాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రానున్న దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వత్రా సిద్దం చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్‌ సంగీతం అమకూరుస్తున్నాడు. త్రివిక్రమ్‌-తారక్‌ సినిమాకు బాణీ అందించడమంటే తన కల నిజం కావడం లాంటిదని తమన్‌ ఒకానొక సందర్భంలో ఓ ఆడియో ఫంక్షన్లో పేర్కొన్నారు.
ఈ సినిమా కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.‘జైలవకుశ’ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని తారక్ కథానాయకుడిగా ‌ నటిస్తున్న చిత్రమిది. ఇవన్నీ ఇలా ఉంటే సినిమా టైటిల్‌ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘అసామాన్యుడు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్‌ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నా సినిమా కోసం తారక్‌ అనేక వ్యామాలు చేసి తన బాడీని ఒక కొత్త రూపు రేకలతో మార్చ్గుకొని ఇంకా ఫిట్‌గా తయారయ్యారు. అయితే ఓ అద్భుత నవలను ఆధారంగా చేసుకొని దాని ఆధారంగా త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమాతో పాటు ఎస్.‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ తారక్‌ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. ఇందులో తారక్‌తో పాటు రామ్‌చరణ్‌ మరో కథానాయకుడిగా నటించనున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తారని వార్తలు వెలువడ్డాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఇటీవల చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఎవరు ఎపాత్రలో కనిపిస్తారా అన్నసంగతి మాత్రం వేచి చూడాలి. అంతే కాకుండా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కపించబోతున్నాడు, అసలు సినిమాలో ఏం చెయబోతున్నాడు అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.