బాలీవుడ్‌లో మ‌రో బంపర్ ఆఫ‌ర్ కొట్టేసిన పూజా హెగ్డే

Tuesday, May 1st, 2018, 05:29:46 PM IST

ఒక లైలా చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన అందాల భామ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన ఆఫర్స్ అందుకొని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన పూజా, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. మహేష్- వంశీపైడిపల్లి చిత్రంలోను ఈ అమ్మడినే కథానాయికగా తీసుకున్నారు. ఇక రాధాకృష్ణ కుమార్ – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలోను పూజా హెగ్డేనే కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇటీవ‌ల ఈ అమ్మడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 గా కూడా సెలక్ట్ అయింది. అయితే మొహెంజదారో చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు హిందీలో మ‌రో చిత్రం చేయ‌నుంద‌ని అంటున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మాతగా, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా తెర‌కెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం హౌస్ ఫుల్ 4 లో పూజా హెగ్డే ఓ ముఖ్య‌మైన పాత్ర చేయ‌నుంద‌ట‌. ఇది త‌న‌కు ఎంతో పేరు తెస్తుంద‌ని చెబుతున్నారు. పూజా హెగ్డే లేటెస్ట్ మూవీ సాక్ష్యం త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది.