మహేష్ సరసన డీజే భామ ?

Tuesday, January 2nd, 2018, 08:47:17 AM IST

దువ్వాడ జగన్నాధం సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ పూజ హెగ్డే కు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. డీజే సినిమాలో పూజ గ్లామర్ కు అందరి ఫిదా అయ్యారు. ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలు ఆరబోయడమే కాకుండా.. బికినిలో షాక్ ఇచ్చింది. అందానికి అందం .. మంచి గ్లామర్ ఉన్న ఈ భామకు క్రేజ్ ఒక్కరిగా పెరిగింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడికి లక్కీ ఛాన్స్ దక్కింది. తాజాగా మహేష్ 25వ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం మహేష్ బాబు , కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఈ నెలతో ఈ షూటింగ్ ఫినిష్ కానుంది .. ఆ తరువాత ఫిబ్రవరి నుండి వక్కంతం వంశీ సినిమా మొదలు కానుంది. మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం జరిపిన అన్వేషణలో ఫైనల్ గా పూజ హెగ్డే ఛాన్స్ కొట్టేసింది.