ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన డీజే భామ ?

Friday, January 26th, 2018, 12:15:14 PM IST

మొత్తానికి అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ పూజ హెగ్డే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం లో నటిస్తున్న ఈ భామ రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. దాంతో పాటు మహేష్ సరసన అవకాశం పట్టేసిన పూజ తాజాగా ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిందట ? ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం వచ్చే నెలనుండి సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ని అనుకున్నారు .. కానీ పవన్ సరసన అజ్ఞాతవాసి లో అను నటించింది .. ఆ సినిమా ఫలితం తారుమారవడంతో త్రివిక్రమ్ హీరోయిన్ ని మార్చాలని ఫిక్స్ అయి .. పూజ ను తీసుకునే ఆలోచన్లలో ఉన్నాడట. సో ఎన్టీఆర్ సరసన పూజ ఛాన్స్ కొట్టేసినట్టే అని అంటున్నారు.