టాప్ 1 లో పూజా.. టాప్ 9 లో అనుష్కా..! మధ్యలో ఎవరు..?

Wednesday, March 14th, 2018, 07:26:01 PM IST

ఒకలైలా కోసం చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన తళుకుల తార, అందాల భామ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన ఆఫర్స్ అందుకొని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా సంచలనం సృష్టిస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన పూజా, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా చాస్ను కొట్టేసింది. మహేష్- వంశీపైడిపల్లి చిత్రంలోను ఈ అమ్మడినే కథానాయికగా తీసుకున్నారు. ఇక రాధాకృష్ణకుమార్ – ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలోను ఈ అమ్మడినే కథానాయికగా తీసుకోవాలని అనుకోవాదానికి సిద్దపడ్డారు. బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ సొగసరి టాలీవుడ్ లో టాప్ చైర్ పై కన్నేసిందని తెలుస్తుంది. అయితే ఈ అమ్మడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 గా సెలక్ట్ కావడం ఆమె అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా ఆకాశానికి ఎగిరేలా చేస్తుంది.

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ హైదరాబాద్ కు సంబంధించిన జాబితాను తాజాగా టైమ్స్ గ్రూప్ తయారు చేసింది. ఇందులో పూజా హెగ్డే టాప్ పొజీషన్ సాధించగా తర్వాతి స్థానాలలో కాజల్ , రకుల్ ప్రీత్ సింగ్, పీవి సింధు, ఆదాశర్మలు ఉన్నారు. టాప్ 5లో నలుగురు సినిమా స్టార్స్ ఉండగా, ఒక్కరు మాత్రమే క్రీడా రంగానికి సంబంధించిన వారు ఉన్నారు. ఇక ఆరవ స్థానంలో తమన్నా, ఏడో స్థానంలో సిమ్రాన్ చౌదరి, ఎనిమిదో స్థానంలో సృష్టి వ్యాకరణం, తొమ్మిదో స్థానంలో అనుష్క పదో స్థానంలో మిథాలీ రాజ్ ఉన్నారు. కాజల్ గత ఏడాది టాప్ 1లో ఉండగా, ఈ సారి ఓ ర్యాంక్ తగ్గి టాప్ 2కి చేరుకుంది. అనుష్క రెండో ర్యాంకు నుండి తొమ్మిదో ర్యాంకుకి పడిపోయింది. హైద్రాబాద్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో హైద్రాబాద్ ఏసీ గార్డ్స్ కు చెందిన బషీర్ అలీ ఎంపిక కాగా, రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచిన సంగతి తెలిసిందే.