ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతున్న జిగేల్ రాణి ?

Sunday, April 1st, 2018, 02:04:49 PM IST

లేటెస్ట్ గా రంగస్థలం లో జిజెల్ అంటూ మెరిసి .. జిగేల్ రాణిగా దుమ్ము రేపుతున్న హాట్ భామ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ సరసన డీజే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఫిజిక్ విషయంలో ఎక్కువ క్రేజ్ తీసుకునే ఈ అమ్మడు జిమ్ లో తెగ కస్టసరత్తులు చేస్తుంది. పూజ చేస్తున్న కసరత్తులు చేస్తుంటే కచ్చితంగా కుర్రాళ్లకు మతులు పెగొట్టేందుకు ఫిక్స్ అయినట్టుంది అని అనక మారరు. ఈ విషయం గురించి ఈ బేబీ స్పందిస్తూ తాను జిమ్ లో కష్టపడడం ఇది ఆరంభమే అని ఇంకా చాలా చేయాలనీ చెబుతుంది. ఇప్పటికే పూజ హెగ్డే , ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. దాంతో పాటు అటు మహేష్ , ప్రభాస్ ల సినిమాల్లో అవకాశాలు ఎదురు చేస్తున్నాయి.