వావ్ .. ఘాటు పెంచిన దువ్వాడ హీరోయిన్ ?

Saturday, February 25th, 2017, 11:23:44 AM IST


ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న గ్లామర్ భామ పూజ హెగ్డే ఈ సినిమాలో ఘాటు పెంచినట్టే కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. అల్లు అర్జున్ కొత్త లుక్ తో షాకిస్తే .. రెచ్చిపోయి అందాలు ఆరబోసి మరో షాక్ ఇచ్చింది పూజ హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మెహొంజొదారో సినిమా భారీ ప్లాప్ అవ్వడంతో సౌత్ లో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు తెలిసింది. ఈ అమ్మడు నడుము సోయగాలు, బికినిలో అదరగొట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు టూ పీస్ బికినీతో రెచ్చిపోయిన ఈ చిన్నది ఈ సినిమాతో టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం ఖాయం అనేలా ఉంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. మరి దువ్వాడ జగన్నాథం తో పూజ కెరీర్ పెద్ద టర్న్ తీసుకున్నట్టే అని అంటున్నారు సినీ జనాలు.