బికినిలో షాకిచ్చిన డీజే బ్యూటీ!

Thursday, April 12th, 2018, 09:33:21 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న బ్యూటీ పూజా హేగ్దే. పూజ ఎప్పుడైతే డీజే సినిమాతో క్లిక్ అయ్యిందో అప్పటి నుంచి జనాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం అనే సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ నెక్స్ట్ తారక్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా కనిపించనుంది. అలాగే మహేష్ 25వ చిత్రంలో కూడా పూజ అవకాశం అందుకుంది. అయితే వరుసగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ పూజ అందాల ఆరబోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. గత కొంత కాలంగా ప్రముఖ మ్యాగజిన్ లకు హాట్ స్టిల్స్ ఇస్తూ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా కూడా ఒక ఫొటో షూట్ లో పాల్గొన్న పూజ బికినిలో అందరిని షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలానే కొనసాగితే పూజ మరికొన్ని ఆఫర్స్ ఈజీగా అందుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.