హ్యాపీగా ఉంటే అందంగా ఉంటారు!

Friday, May 11th, 2018, 10:38:14 PM IST

సంతోష‌మే స‌గం బ‌లం అంటారు! కానీ ఆ సంతోషం ఈరోజుల్లో ఎక్క‌డుంది? గ‌జిబిజి బిజీ లైఫ్‌లో అన్నిటినీ కోల్పోయే ప‌రిస్థితి. కుటుంబ బంధాలు, అనుబంధాలు లేని ఈ రోజుల్లో అస‌లు హ్యాపీ ఏం ఉంటుంది? అందుకేనేమో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఇలా హ్యాపీ గురించి చాలా ఆనందంగా చెప్పింది. హ్యాపీగా ఉంటే చాలు అందంగా క‌న‌బ‌డ‌తారు.. అని చెప్పింది ఈ అమ్మ‌డు.

కెరీర్ ప‌రంగా ఎలాంటి క‌ష్టం లేదు. హాయిగా అంతా సాగిపోతోంది. తెలుగులో అన్నీ క్రేజీ సినిమాల్లోనే ఛాన్సులు అందుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌ లాంటి స్టార్ల స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల క్యూ ఉంది. ఇంత పెద్ద లైన‌ప్ ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా హ్యాపీగానే ఉంటారు. అందంగానే క‌నిపిస్తారు. అయితే కెరీర్ ఊహించ‌ని రీతిలో డ‌ల్ అయిపోతేనే కాస్తంత ఇబ్బందిప‌డిపోయి .. ఏ హ్యాపీ ఉండ‌దు కానీ.. ఇప్ప‌టికైతే పూజా హ్యాపీనెస్‌కి వ‌చ్చిన ఢోకా ఏం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments