నన్ను అలా అడుగుతారా… ఖబడ్దార్ అంటున్న హాట్ భామ ?

Monday, October 23rd, 2017, 10:13:43 AM IST

ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ బరస్ట్ అవుతున్నారు. సినిమా రంగంలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు చాలా మంది హీరోయిన్స్ చెప్పేసారు, హీరోయిన్స్ చెప్పిన విషయాలు సంచలనం రేపాయి. ఈ విషయం పై తాజాగా అల్లు అర్జున్ హీరోయిన్ పూజ హెగ్డే స్పందించింది. లేటెస్ట్ గా డీజే లో నటించిన ఈ భామ సినిమా రంగంలో వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ అదే లైంగిక వేధింపుల విషయం స్పందించింది. నన్ను అలా అడిగే దమ్ము ఎవరికీ ఉంది ? అయినా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అలాంటి చేదు అనుభవాలు మాత్రం ఎదురు కాలేదు అంటూ చెప్పింది. అయినా నా గురించి తెలిసిన వాళ్ళు అలాంటి దైర్యం ఎవరైనా చేస్తారా ? అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. మొత్తానికి పూజ హెగ్డే దమ్ము చూస్తుంటే అదరగొట్టేలా ఉంది.