బికినీతో షాకిచ్చిన .. జిగేల్ రాణి ?

Monday, April 9th, 2018, 02:11:51 PM IST

జిల్ .. జిల్ .. జిగేలు రాణి .. అంటూ రంగస్థలం లో ఓ ఊపు ఊపేసిన పూజ హెగ్డే క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే ఈ అమ్మడికి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు పెట్టేస్తూ బిజీగా ఉంది .. మరో వైపు ఐటెం సాంగ్స్ కు కూడా ఓకే చెబుతూ రెండు చేతుల బాగానే సంపాదిస్తుంది. రామ్ చరణ్ సరసన జోరుగా చిందేసిన జిగేలు రాణి ఊపుకు జనాలు ఊగేస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ ల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.

అది కాకుండా అప్పుడప్పుడు హాట్ హాట్ అందాలతో ఫోటోలకు పోజులిచ్చే ఈ భామ తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఏకంగా బికినిలో శాఖ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. బికినీ అందాల్లో పూజ ను చుసిన జనాలు షాక్ అవుతున్నారు. మరి ఈ అమ్మడి బికినీ దెబ్బకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు పట్టేయడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.