మొదలైన పూజ ఐటెం సాంగ్ షూటింగ్ !

Monday, February 5th, 2018, 02:54:32 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న రంగస్థలం చిత్రం మొదటి లుక్ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రం లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. 1985 కాలం నటి పరిస్థితుల నేపథ్యం లో జరిగే చిత్రం కావటం తో ఆ కాలం నాటి పరిస్థితులకు అద్ధం పట్టేలా సుకుమార్ ప్రతిదీ చాలా కేర్ తీసుకుని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆడియో విడుదల కానున్న దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని ఒక ఐటెం సాంగ్ లో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకు సుకుమార్ దేవి కాంబినేషన్ వచ్చిన తొలి పాట ‘అ అంటే అమలాపురం’ మొదలుకొని ఇప్పటివరకు వచ్చిన అన్ని చిత్రాల్లోని ఐటెం సాంగ్స్ మంచి హిట్ అందుకున్నవే. వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ పాట కూడా వుండనుందట. ఈ పాత విషయమై దేవి ఇదివరకే ఒక ట్యూన్ కంపోజ్ చేసినా అది అనుకున్న స్థాయిలో లేదని, కావున మరొక ట్యూన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో పూజ హెగ్డే అందాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయట. ఆ విధంగా చిత్రం లో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా యూనిట్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత చిత్రీకరణ తర్వాత చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నాడు. కాగా మార్చి నెల 30 న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు….