కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కమల్ హీరోయిన్ ?

Wednesday, July 25th, 2018, 02:34:38 PM IST

ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లలో ఉంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఈ వ్యవహారంలో దైర్యంగా ముందుకు వచ్చి .. ఈ విషయం పై బాహాటంగానే స్పందించారు. తాజాగా టాలీవుడ్ లోకూడా కొందరు హీరోయిన్స్ స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీరెడ్డి వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కమల్ హాసన్ సరసన విశ్వరూపం సినిమాలో నటించిన పూజ కుమార్. ఈ మద్యే రాజశేఖర్ సరసన గరుడావెగా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ భామ తాజగా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ప్రస్తుతం పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఉన్న విషయం తెలిసిందే. దీని ద్వారా చాలా మంది హీరోయిన్స్ , ముక్యంగా కొత్తగా వచ్చేవాళ్ళు సఫర్ అవుతున్నారని తెలిపింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు ఎలాంటి చేదు అనుభవాలు లేవని చెప్పింది ఈ ఇండో అమెరికన్ గ్లామర్ భామ పూజ !!

  •  
  •  
  •  
  •  

Comments