నెట్ లో కలకలం రేపిన పూనమ్ కౌర్ ట్వీట్ !

Monday, January 29th, 2018, 06:09:42 PM IST

పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ ల వివాదం సమయం లో కత్తి చేసిన కొన్ని ఆరోపణల వల్ల పూనమ్ పేరు వున్నట్లుండి తెరమీదకు వచ్చింది. పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ గురించి ఆయన సంధించిన ప్రశ్నలకు బదులుగా స్పందించిన పూనమ్ పవన్ సర్ ఈ వివాదంలోకి నన్ను లాగడం వల్ల నా మూవీ కెరీర్, పర్సనల్ లైఫ్ కూడా ప్రమాదంలో పడే అవకాశం వుంది, ఈ విషయమై మీతో మాట్లాడాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని ఆమె తెల్పడం చూసాము. అయితే ఆ తరువాత కత్తికి, పవన్ అభిమానులకు మధ్య సయోధ్య కుదరడంతో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే మళ్ళి ఇన్నాళ్లకు పూనమ్ చేసిన ఒక ట్వీట్ నెట్లో సంచలనం రేపుతోంది. డబ్బుకోసం మారిపోయిన సిద్ధాంతాలు, మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ, నీ గుణం ఏంటని ఆమె ట్వీట్ చేసారు. ఈ వ్యాఖ్యలు ఆమె పవన్ ని ఉద్దేశించే చేసిందని ఆగ్రహించి పవన్ ఫాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తరువాత దానిపై వివరణ ఇచ్చిన పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసింది కాదని, డబ్బుకోసం ఒక కూతురిని అమ్ముకున్న తండ్రిని ఉద్దేశించి ఆవేదన తో ఆ ట్వీట్ చేసానని అనడంతో పవన్ ఫాన్స్ కొంత శాంతించారు…