పూన‌మ్ వాయిస్ టేపు దొంగ అరెస్ట్

Wednesday, June 12th, 2019, 04:51:38 PM IST

ఎన్నిక‌ల ముందు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై దారుణ‌మైన కుట్ర‌కు తెగ‌బ‌డ్డ సంగ‌తి తెలిసిందే. అత‌డిని అబాసు పాలు చేసేందుకు వైరి వ‌ర్గాలు ప‌న్నిన కుట్ర‌లు అన్నీ ఇన్నీ కావు. అప్ప‌ట్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ని బ‌ద‌నాం చేసేందుకు న‌టి పూన‌మ్ కౌర్ వాయిస్ ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌ద‌లి అదంతా నిజ‌మేన‌ని న‌మ్మ‌బ‌లికారు. అయితే ఆ వాయిస్ జూనియ‌ర్ ఆర్టిస్టు కోటిద‌ని క‌నిపెట్టిన సంగ‌తి తెలిసిందే. దాంతో ల‌క్ష్మీ పార్వ‌తి, న‌టి పూన‌మ్ కౌర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు కోటి కోసం వెతుకుతున్నారు.

తాజాగా ఆ వాయిస్ దొంగ కోటి దొరికారు. పోలీసులు ఈ కేసులో పురోగ‌తిని సాధించారు. ల‌క్ష్మీపార్వ‌తి ఇంట్లో ప‌నిచేసిన కోటి అనే జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఇదంతా చేశారు. వాయిస్ వివాదం అనంత‌రం ల‌క్ష్మీ పార్వ‌తి లైంగికంగా త‌న‌ని వేధింపుల‌కు గురి చేస్తోందంటూ అస‌భ్య ప‌ద‌జాలంతో ఆమెపై కోటి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌ప్పించుకు తిరుగున్న కోటిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ల‌క్ష్మీపార్వ‌తి.. పూన‌మ్ కౌర్ కి రిలీఫ్ ద‌క్కింది. ఇక ఈ కేసులో ల‌క్ష్మీపార్వ‌తి మొబైల్ నుంచి మెసేజ్‌లు పెట్ట‌డంతో పాటు పూన‌మ్ కౌర్ వాయిస్ ని కూడా సోష‌ల్ మీడియాకు లీక్ చేసింది కోటినే అని పోలీసులు నిర్ధారించారు. ఇంత‌కాలం త‌ప్పించుకుని తిరుగుతున్న కోటి మంగ‌ళ‌వారం నాంప‌ల్లి కోర్టులో లొంగిపోవ‌డం అటుపైనా కేఏ పాల్ సోద‌రుడు డేవిడ్ రాజు హ‌త్య కేసుతోనూ సంబంధాలు ఉన్నాయ‌ని డొంక క‌ద‌ల‌డంతో కేసు తీవ్ర‌మైన మ‌లుపు తీసుకుంది.