బిపాసా భ‌ర్త‌తో తెలుగ‌మ్మాయి సీక్రెట్ గేమ్‌?

Saturday, March 31st, 2018, 10:16:22 PM IST

అవును.. తెలుగ‌మ్మాయ్‌.. టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్శీ గాళ్ పూన‌మ్ కౌర్‌కి బిపాసా బ‌సు భ‌ర్త క‌ర‌ణ్‌సింగ్ గ్రోవ‌ర్‌తో అస‌లేం ప‌ని? అస‌లేం జ‌రుగుతోంది? ఎనీ థింగ్ సీక్రెట్‌.. తెలియాలంటే వివ‌రంలోకి డీప్‌గా వెళ్లాలి..

గ‌త కొంత‌కాలంగో పూన‌మ్‌కౌర్ వార్త‌ల్లో క‌థానాయిక‌గా వెలిగిపోతోంది. సినిమాల్లో న‌టించేది త‌క్కువ‌, బ‌య‌ట ప్ర‌చారం ఎక్కువ క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ – క‌త్తి మ‌హేష్ కాంట్ర‌వ‌ర్శీలో ఈ అమ్మ‌డి పేరు ప్ర‌ముఖంగా హైలైట్ అయ్యింది. ఆ క్ర‌మంలోనే పూన‌మ్ ఇమేజ్ కూడా పెరిగింది. వివాదంలోంచి పుట్టుకొచ్చిన గంద‌ర‌గోళంలో త‌న‌కి కావాల్సినంత ప‌బ్లిసిటీ వ‌చ్చింది. మ‌రోవైపు ఈ భామ‌కు తెలుగు దేశం ప్ర‌భుత్వం నుంచి ప‌లు ర‌కాల ఆఫ‌ర్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అదంతా స‌రే.. త్వ‌ర‌లోనే పూన‌మ్‌ని బాలీవుడ్ ర‌మ్మ‌ని పిలుస్తోంది. అక్క‌డ అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి తాను న‌టిస్తానంటే. ముందుగా న‌ల్ల‌క‌లువ బిపాసా బ‌సు భ‌ర్త క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ స‌ర‌స‌న ఓ అవ‌కాశం వ‌చ్చింది. 3 దేవ్ అనేది సినిమా టైటిల్. ఇందులో రాధ అనే పాత్ర‌లో న‌టిస్తోంది. ఇదే చిత్రంలో బెంగాళీ బాంబ్ షెల్ రైమా సేన్ వేడెక్కించే పాత్ర‌లో న‌టిస్తోంది. అంకూష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో రాధ అనే 25 ఏళ్ల అమ్మాయిగా న‌టించేందుకు .. వ‌య‌సును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాన‌ని పూన‌మ్ తెలిపింది.