పిక్ టాక్‌: పూన‌మ్ వీణ గానం!

Thursday, September 20th, 2018, 02:05:36 AM IST

ఇటీవ‌ల చ‌డీచ‌ప్పుడు లేకుండా సైలెంట్‌గా ఉంది పూన‌మ్ కౌర్. ఈ హైద‌రాబాదీ అంద‌గ‌త్తె గ‌త కొంత‌కాలంగా వివాదాస్ప‌ద ట్వీట్ల‌తో ర‌చ్చ చేసింది. అటు ప‌వ‌న్‌- క‌త్తి మ‌హేష్ వివాదంలో పూన‌మ్ పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం యువ‌త‌రంలో చ‌ర్చ‌కొచ్చింది. అదంతా స‌రే.. పూనమ్ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? అంటే …

ఇప్ప‌టికిప్పుడు ఓ టీవీ సీరియ‌ల్ లో న‌టిస్తోంది. అలానే ఓ బాలీవుడ్ చిత్రంలోనూ న‌టిస్తోంద‌న్న సమాచారం ఉంది. టాలీవుడ్‌లో మాత్రం వేరే ఏ సినిమాకి క‌మిట‌వ్వ‌లేదు. ఇటీవ‌లే శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంలో త‌ళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం బిపాస భ‌ర్త క‌ర‌ణ్‌సింగ్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంద‌న్న స‌మాచారం ఉంది. అదంతా స‌రే.. ఇదేంటి ఉన్న‌ట్టుండి ఇలా స‌రస్వ‌తీదేవిలా ప్ర‌త్య‌క్ష‌మై వీణ వాయిస్తోంది? అంటారా? ఈ లుక్ దేనికోస‌మో తెలీదు కానీ, త‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. వీణ వాయిద్యం వినిపిస్తున్న పూన‌మ్ చేనేత చీర‌లో క‌నిపిస్తోంది. అంటే ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పూన‌మ్ ఈ ప‌ని చేస్తోందా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.