పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ – కత్తి మహేష్ కాంట్రవర్శీలో ప్రధానంగా పూనమ్ కౌర్ పేరు హైలైట్ అయిన సంగతి తెలిసిందే. పొలిటికల్ వివాదంలోకి పూనమ్ పేరు తేవడంతో బోలెడంత రచ్చ అయ్యింది. కత్తికి పవన్ అభిమానుల నుంచి సీరియస్ హెచ్చరికలు జారీ అవ్వడంతో ఆ గొడవ కాస్తా ఎక్కడికో వెళ్లింది. అదంతా అటుంచితే, అసలు పూనమ్‌కి ఏపీ ప్రభుత్వం పలు ప్రచార కార్యక్రమాలు అప్పజెప్పడం వెనక పవన్ రికమండేషన్ ఉందని, ఆ క్రమంలోనే కత్తి మహేష్ అనవసరంగా ఆ పేరు కెలికాడని చెప్పుకున్నారంతా.
గతంగతంః అనుకుంటే, తాజాగా పూనమ్ మరో క్రేజీ ప్రాజెక్టును చేతబట్టడం ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రతిష్ఠాత్మక ఆర్కామీడియా సంస్థ నిర్మిస్తున్న `స్వర్ణ ఖడ్గం` సీరియల్ తెలుగు వెర్షన్లో పూనమ్‌ని ప్రధాన పాత్రకు ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈటీవీలో టెలీకాస్ట్ కానున్న ఈ సీరియల్ ఏకంగా మూడేళ్ల పాటు కంటిన్యూ అవుతుంది. అంటే అంతవరకూ పూనమ్ కెరీర్ పరంగా బిజీ అయినట్లే. ఈ అవకాశం రావడం వెనక పొలిటికల్ నేతల సాయం ఉందంటూ ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ పేర్కొంది. ఇదే సీరియల్ కన్నడ వెర్షన్లో సంజన నటిస్తున్న సంగతి విదితమే. ఇటు సీరియల్ ఛాన్స్‌తో పాటు, అటు బాలీవుడ్‌లోనూ పూనమ్ ఓ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అందుకుంది. బిపాస బసు భర్త కరణ్‌సింగ్ గ్రోవర్ నటిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్టులో పూనమ్ లీడ్ పాత్రలో నటించనుంది.