స్టార్ హీరోతో పెళ్లికి సిద్దమైన పూనమ్ కౌర్ .. కారణం అదేనా ?

Tuesday, September 26th, 2017, 03:26:22 PM IST


సాధారణంగా సినిమా వాళ్ళ జీవితాల్లో కూడా అచ్చంగా సినిమాల్లో చూపించినట్టు ఎన్నో ట్విస్టులు ఉంటాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ట్విస్ట్ ఒకటి జరగబోతుంది ? టాప్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఓ హీరో మరో సారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడట ? ఇప్పటికే అతగాడితో సదరు హీరోయిన్ డేటింగ్ లో ఉందని, వీరిద్దరి వ్యవహారం పై జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఆ హీరో పెళ్లి విషయంలో పలుమార్లు విమర్శలు కూడా రావడం గమనార్హం !! అయితే అతగాడు తాజాగా పెళ్లి చేసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా .. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న పూనమ్ కౌర్ ? అవును మీరు వింటున్నది నిజమే .. కొంత కాలంగా ఈ అమ్మడు ఆ స్టార్ హీరోతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరి విషయం ఇప్పటికే జోరు ప్రచారం సాగింది. తాజాగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు సదరు స్టార్ హీరో సిద్ధం అయ్యాడట ? మరో వైపు ఇవన్నీ ఉట్టి పుకార్లే .. కావాలంటే ఎవరో ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారని అంటున్నారు. అయినా నిప్పు లేనిదే పొగ రాదుగా .. ? ఫైనల్ గా పూనమ్ తో ఆ హీరో ఎఫైర్ మాత్రం నిజమనే తెలిసింది .. ఇక పెళ్లి గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే !!

Comments