తనే అందగత్తె అని.. పూనమ్ కి ఓటెయ్యాలట

Wednesday, September 27th, 2017, 08:18:48 PM IST

ప్రస్తుత రోజుల్లో యువతపై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు దీన్ని అవసరానికి వాడుకుంటే. మరికొందరు అసహ్యంగా వాడుకుంటున్నారు. ఇక తారలు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ సినిమాలకు ఓ వైపు నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక కొందరు హీరోయిన్స్ అయితే ఎవరు ఊహించని విధంగా ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఏ మాత్రం హద్దులు లేకుండా వయ్యారాలు సోషల్ మీడియాలో చూపించేస్తున్నారు.

అటువంటి వారిలో ముందుగా ఉండే సెలబ్రెటీ ఎవరో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం. లేదు ఆమె ఎవరో కాదు సోషల్ మీడియా హాట్ బాంబ్ పూనమ్ పాండే. ఘాటు ఫొటోలతో పాటు అందం ఉన్నది చూపించుకోవడనికే అని కాంట్రవర్షియల్ కామెంట్స్ పెట్టి అందరి చూపును తన వైపు తిప్పుకునేలా చేసుకుంటోంది. అయితే రీసెంట్ గా మరో కామెంట్ పెట్టి తివ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. ‘నేను తెలివైనదాన్ని.. మంచి ఫిజిక్ మరియు గ్లామరస్‌ బ్యూటీ నేను. ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి.? ప్లీజ్‌ నాకు ఓట్ చేయండి. నేను ‘మేగ్జిమ్స్‌ ఫైనెస్ట్‌’ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. సో నన్ను గెలిపించండి అని కామెంట్ పెట్టింది. అయితే ఈ పోటీల్లో అమ్మడు గెలుస్తే.. భారీ ప్రైజ్ మనీ దక్కుతుంది. గెలిస్తే సమాజ సేవకు ఆ డబ్బును ఉపయీగిస్తుందట. అయితే నెటిజన్స్ పూనమ్ నువ్వు పోటీ చేసి ఇండియా పరువు తియ్యకు.ని వల్ల దేశం పరువు పోయే పరిస్థితీ ఉంది అంటూ.. ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments