యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ దెబ్బ ..!

Sunday, February 12th, 2017, 07:08:59 PM IST


సంక్రాంతికి విడుదలైన చిత్రాలు అమెరికాలో కాసుల వర్షం కురిపించడంతో డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. ఆ చిత్రాల జోరు చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకున్నారో ఏమో కానీ తాజాగా విడుదలైన సింగం 3, ఓం నమో వెంకటేశాయ చిత్రాలను భారీ రేటుకు కొనుక్కుని దెబ్బై పోయినట్లు తెలుస్తోంది. అంతకు ముందు విడుదలైన నాని చిత్రం నేను లోకల్ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ సింగం 3, ఓం నమో వెంకటేశాయ చిత్రాల వసూళ్లు అంత ఆశాజనకంగా లేనట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సింగం 3 చిత్రం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయింది. ఇక ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ ఐదున్నర కోట్లు పెట్టి కొనుక్కున్నాడట. కానీ ఇప్పుడు వస్తున్న వసూళ్లను బట్టి చూస్తుంటే ఆ చిత్రం లాభాలను సాధిస్తుందా అనేది అనుమానంగా మారింది. కాగా ఈచిత్రానికి మంచి టాక్ ఉండడంతో పోనుపోను పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఎక్కువగా ఉంటుందని భావించారు. అమెరికాలో సాధారణంగా ఫ్యామిలీ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈవారం యూఎస్ ఆడియెన్స్ సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు.