నటనలో ఏమాత్రం తీసి పోకుండా చిన్నప్పట్టి నుండే ఎదో ఒక పాత్రలో తండ్రి తీసిన చాలా సినిమాలలో నటించి మంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. ఆకాశ్ పూరీ, నేహ శెట్టి ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం మెహబూబా. మే 11న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన టీం కొద్ది సేపటి క్రితం ఓ ప్రియా.. నా ప్రియా’ అంటూ సాగిన పాటని విడుదల చేశారు. ప్రగ్యా దాస్ గుప్తా, సందీప్ బాత్రా పాడిన పాట సంగీత ప్రియులని అలరిస్తుంది. త్వరలో సందీప్ చౌత్ సమకూర్చిన మరి కొన్ని బాణీలు కూడా విడుదల చేయనున్నారు. మెహబూబా చిత్రం ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా, ఈ చిత్రం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలోని బోర్డర్లో చిత్రీకరణ జరుపుకుంది. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.