వారానికో అడ్రెస్‌ మార్చేస్తున్న పాప్ సింగ‌ర్‌! బియాన్స్‌

Tuesday, December 5th, 2017, 06:13:44 PM IST

సెల‌బ్రిటీల‌కు ఆన్‌లైన్ హ్యాక‌ర్ల థ్రెట్ ఏ రేంజులో ఉందో చెప్పేందుకు ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. టాప్ సెల‌బ్రిటీల ఈమెయిల్స్ హ్యాక్ చేసి, వారి వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని త‌స్క‌రించ‌డ‌మే గాక‌, ఏకంగా బ్యాంక్ పాస్‌వ‌ర్డ్‌లు కొట్టేసి, డాల‌ర్ల‌లో సొమ్ముల్ని కాజేస్తున్నారు. అంతేకాదు .. ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాల్ని తెలుసుకుని నానా తంటాలు తెచ్చి పెడుతున్నారు. ఆ కోవ‌లోనే హ్యాక‌ర్లు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల‌పై మెరుపు దాడులు చేశారు. బిలియ‌న్ డాల‌ర్ సొమ్ముల్ని ఎగ‌రేసుకుపోయారు.

ఇక‌పోతే ఇలాంటి భ‌యంతోనో, లేక త‌న‌కు వేదింపులు త‌ప్ప‌వ‌ని వ్య‌థ చెందిందో ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పాప్ సింగ‌ర్ బియాన్స్ త‌న ఈమెయిల్ ఐడీల్ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేస్తోంది. ఇంకా చెప్పాలంటే వారం వారం కొత్త ఈమెయిల్స్ తెరుస్తూ త‌న ఉనికికి ఎలాంటి ప్ర‌మాదం లేకుండా కాపాడుకుంటోంది. ఇక బియాన్స్ త‌ర‌హాలోనే తాను కూడా వారం వారం ఈమెయిల్ అడ్రెస్ మార్చేస్తున్నాన‌ని కో- సింగ‌ర్ ఎడ్ షీర‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. నేను కూడా బియాన్స్‌నే అనుస‌రిస్తూ నా ఈమెయిల్ ఐడీని వారం వారం మార్చేస్తున్నాన‌ని అందుకు కార‌ణాల్ని వెల్ల‌డించాడు ఇత‌గాడు. ఇక టాప్ రేంజ్ సెల‌బ్స్ ఇప్ప‌టికే ఒక్కో వ్య‌వ‌హారానికి ఒక్కో ర‌కం ఈమెయిల్‌ని వాడుతున్నారు. ఒక‌టి కుటుంబ స‌భ్యుల కోసం .. ఇంకొక‌టి ఆర్థిక వ్య‌వ‌మారాల కోసం, వేరొక‌టి బిజినెస్ డీల్స్ చ‌క్క‌దిద్దుకునేందుకు .. ఇలా ర‌క‌రకాల మెయిల్స్ తెరిచి కొంత‌వ‌ర‌కూ సేవ్ అవుతున్నారు. షేవ్ కాకుండా!?

  •  
  •  
  •  
  •  

Comments