వారాహి ఆఫీస్‌లో ఇన్‌క‌మ్‌ట్యాక్స్ సోదాలు

Thursday, September 22nd, 2016, 12:06:56 AM IST

Sai-Korrapati
వారాహి చ‌ల‌న‌చిత్రం దూకుడు గురించి తెలిసిందే. వ‌రుస‌గా విజ‌య‌వంత‌మైన సినిమాలు తీస్తూ ల‌క్కీ బ్యాన‌ర్‌గా దూసుకుపోతోంది. నిర్మాత సాయి కొర్ర‌పాటి త‌న‌కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని అభిరుచి ఉన్న నిర్మాత‌గా ముందుకెళుతున్నారు. ఈగ‌, బాహుబ‌లి (డిస్ట్రిబ్యూట‌ర్‌), దిక్కులు చూడ‌కు రామ‌య్యా, ఊహ‌లు గుస‌గుస‌లాడే, అందాల రాక్ష‌సి.. ఇలా వ‌రుస‌గా టాప్ మూవీస్‌ని తెర‌కెక్కించిందీ సంస్థ‌. ఈ స్పీడ్‌లోనే జ్యో అచ్యుతానంద కూడా విజ‌యం అందుకుంది.

ఈ స్పీడ్‌లో ఉన్న‌ప్పుడే ఇన్‌కంట్యాక్స్ అధికారులు అనూహ్యంగా మ‌ణికొండ‌లోని వారాహి చ‌ల‌న‌చిత్రం కార్యాల‌యంపై దాడులు చేసి సోదాలు చేశారు. ఆ స‌మ‌యంలో సాయి కొర్ర‌పాటి ఆఫీస్‌లోనే ఉన్నారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులు వ‌చ్చీ రాగానే డోర్స్ అన్నీ లాక్ చేసి అంద‌రినీ దిగ్భంద‌నం చేశారు. రికార్డులు, అకౌంట్లు అన్నీ చెక్ చేశారు. దాదాపు 3గంట‌ల పాటు ఈ సోదాలు సాగాయి.