బిగ్ న్యూస్ : టీడీపీ పై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోసాని..!

Sunday, July 5th, 2020, 09:30:15 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు మరింత హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో కుల పరమైన రాజకీయాలు ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కాస్త ఎబ్బెట్టు కలిగించే అంశాలనే లెవనెత్తుతున్నారని చెప్పాలి.

ప్రతీదానికి కులపరమైన లింకులు పెడుతూ వస్తున్నారు. ఇవి వారి పార్టీ కే నష్టం కలిగించే అంశాలుగా మారుతాయని చెప్పాలి. ఇప్పుడు వీటిపైనే పరోక్ష వైసీపీ నేత మరియు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కులాలకు మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని అలాంటి జగన్ కు కులాన్ని అంటగడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే కుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు.